- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో మంగళవారం మాజీ సర్పంచ్ బక్కూరి గోపి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య మహిళ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మహిళ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు. అనంతరం మాజీ సర్పంచ్ గోపి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో గొప్పది అన్నారు. ఎండనకా, వాననక పారిశుద్ధ్య కార్మికులు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
- Advertisement -



