Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లిలో చలివేంద్రాన్ని ప్రారంభించిన భీంగల్ సిఐ

కమ్మర్ పల్లిలో చలివేంద్రాన్ని ప్రారంభించిన భీంగల్ సిఐ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని భీంగల్ సిఐ పొన్నం సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మండల కేంద్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న లైన్స్ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు లుక్కా గంగాధర్ మాట్లాడుతూ ప్రయాణాల నిమిత్తం బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులు బస్సుల కోసం వేసి చూసే సమయంలో దాహంతో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల దాహం తీర్చుకునేందుకు స్వచ్ఛమైన చల్లని త్రాగు నీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య,  వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నలిమేల రేవతి గంగారెడ్డి, కోశాధికారి తెడ్డు రమేష్, సభ్యులు చింత ప్రదీప్, బద్దం రాజశేఖర్, కనక గంగాధర్, సున్నం మోహన్, గుండు జి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -