Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్తు పదార్థాలు సేవిస్తే నిమిషాల్లో తెలిసిపోద్ది

మత్తు పదార్థాలు సేవిస్తే నిమిషాల్లో తెలిసిపోద్ది

- Advertisement -

కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
మత్తు పదార్థాలు సేవిస్తే పది నిమిషాల్లో తెలిసిపోతుందని కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన కొంతమంది యువకులు మత్తు పదార్థాలు సేవిస్తున్నారని అనుమానం కలిగి మంగళవారం వారిని రాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేయగా వారిలో పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన మందపల్లి రాజు, కందుగుల శ్రీనివాస్ అనే ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. వారిపై ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.మండలంలోని ప్రతి గ్రామంలో ఎవరెవరు మత్తు పదార్థాలకు అలవాటు అయ్యారు. అట్టి యువకుల వివరాలను సేకరించినట్లుగా,అట్టి యువకుల ప్రవర్తనను తాము రోజు గమనిస్తున్నట్లుగా తెలిపారు.

ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినట్లు అనుమానం కలిగినట్లయితే వెంటనే బీట్ కానిస్టేబులు వారి వద్ద ఉన్న టెస్ట్ కిట్టు ద్వారా పరీక్షించినట్లయితే వారు గత 6 నెలల కాలంలో ఎప్పుడు మత్తు పదార్థాలు సేవించిన ఈ టెస్ట్ కిట్ ద్వారా సేవించినది లేనిది పది నిమిషాల్లో తెలిసిపోతుందన్నారు.వాటి ద్వారా వారి పైన కేసులు నమోదు చేయబడతాయన్నారు.కావున మండలంలోని యువకులు ఎవరికైనా ఈ విధంగా మత్తు పదార్థాలు అలవాటు ఉన్నట్లయితే స్వచ్ఛందంగా పోలీసు వారిని సంప్రదిస్తే వారికి డి అడిక్షన్ సెంటర్ కి పంపించి కేసు నమోదు చేయకుండా పంపించి వారి ద్వారా ఇట్టి అలవాటును మాన్పించే ప్రయత్నం చేయబడుతుందని,దాని ద్వారా యువకుల భవిష్యత్ బాగుంటుందని తెలిపారు.అలా కాకుండా ఎవరైనా ఈ విధంగా మత్తు పదార్థాలకు అలవాటైన వాటిని రవాణా చేసిన అమ్మిన కలిగి ఉన్న వారిపైన కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకొనబడతాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -