నవతెలంగాణ – హైదరాబాద్ : సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆర్మీ అంతర్గత విచారణతో పాటు హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. తాజాగా కేంద్ర మిలటరీ ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి దిగింది. ఆయుధాల చోరీ వెనుక బయటి వ్యక్తులతో పాటు లోపలి వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఆగస్టు 30 రాత్రి నుంచి 31వ తేదీ తెల్లవారుజాము మధ్య చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆర్మరీలోని ఆయుధాల పెట్టెల తాళాలు పగులగొట్టి ఒక ఇన్సాస్ రైఫిల్, నాలుగు ఏకే-47లు, ఆరు పిస్టళ్లు సహా మొత్తం 12 ఆయుధాలను అపహరించినట్లు సమాచారం. వీటితో పాటు 21 మ్యాగజైన్లు, 1,912 రౌండ్ల తూటాలు, నైట్ విజన్ బైనాక్యులర్ కూడా చోరీకి గురైనట్లు తెలుస్తోంది.
బొల్లారంలో ఆయుధాల చోరీ.. రంగంలోకి ఆర్మీ ఇంటెలిజెన్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



