Wednesday, April 15, 2026
E-PAPER
Homeఆటలుఅజింక్యా రహానే భారీ జరిమానా

అజింక్యా రహానే భారీ జరిమానా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల భారీ జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక‌టి వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా, నాలుగింట‌ కేకేఆర్‌ ఓటమి పాలవడం గమనార్హం. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రహానే సేన నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమైంది. ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పేర్కొంది. ఈ సీజన్‌లో కేకేఆర్ జట్టుకు ఇది మొదటి తప్పిదం కావడంతో కెప్టెన్ రహానేకు రూ.12 లక్షల జరిమానాతో సరిపెట్టినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -