- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. జలంధర్ కంటోన్మెంట్‌లోని 16, ది మాల్ రోడ్‌లో ఉన్న ఆయన నివాసంలో సోదాలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. రాఘవ్ చద్దా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఉపనాయకుడిగా మిట్టల్‌ను నియమించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి మిట్టల్ నివాసం సహా ఆయనకు సంబంధించిన పలు వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాలపై త్వరలో ప్రకటన ఉంటుందని అన్నారు. అశోక్ కుమార్ మిట్టల్ వ్యాపారవేత్త, విద్యావేత్త. లవ్లీ గ్రూప్‌నకు అధిపతిగా ఉన్నారు.
- Advertisement -



