- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్లు పేలిపోవడంతో నలుగురు చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి.
- Advertisement -



