నవతెలంగాణ-హైదరాబాద్: డీలిమిటేషన్ వ్యవహారంపై ప్రతిపక్షాలు పలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జనాభా లెక్కలు చేపట్టకుండా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మీడియా సమావేశంలో కౌంటర్ ఇచ్చారు. డీలిమిటేషన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలను కలిసి, అభిప్రాయలను తీసుకుంటుందని, ప్రతిపక్షాలకు భయమెందుకని ప్రశ్నించారు. అప్పుడు సందేహాలను, ప్రశ్నలను సదురు కమిటీకి తెలియజేయండని సూచించారున. బెంగాల్‌ను విభజించడానికి డిలీమిటేషన్ అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళలు ఇంకెంత కాలం వేచి ఉండాలి, ఆమె మహిళలకు రిజర్వేషన్లను ఆపడానికి ప్రయత్నిస్తుందా, బెంగాల్ ప్రజల మనస్సులలో భయాన్ని కలిగిస్తోందని మండిపడ్డారు. మహిళ రిజర్వేషన్లు బిల్లుపై మమతా తన వైఖరీ ఎంటో స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ సీట్లను 850కి పెంచాలన్న కేంద్రం ప్రతిపాదనపై విలేఖర్లు ప్రశ్నించగా.. అదే గరిష్ఠ పరిమితి అని ఆమె స్పష్టం చేశారు.
డీలిమిటేషన్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



