Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ ఇసుక పైన సిసిఎస్ టీం మెరుపు దాడి 

అక్రమ ఇసుక పైన సిసిఎస్ టీం మెరుపు దాడి 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలపై సిసిఎస్ టీం మెరుపు దాడి చేశారు.నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ మస్తాన్ వలీ, ఆధ్వర్యంలో సిబ్బంది ఈ మెరుపు దాడిలో పాల్గొన్నారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పక్కాగా అందిన   సమాచారం మేరకు సిసిఎస్ ఏసీపీ మస్తాన్ వలీ, సిబ్బందితో మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు 14టైర్ల లారీలు, ఇద్దరు డ్రైవర్లను, 2 సెల్ ఫోన్స్  స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం వేల్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బర్ల సంజీవ్ కు అప్పగించినట్లు సిసిఎస్  ఏసీపీ మస్తాన్ వలీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -