నవతెలంగాణ – నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని సత్యపాల్ రెడ్డి 59 వ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించినట్లు ఆ పార్టీ మండల సీనియర్ నాయకుడు గుదే యుగేందర్ గౌడ్ తెలిపారు. బుధవారం యుగేందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో స్థానిక విశ్రాంతి భవనంలోని స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, మాధవి ప్రశాంత్ తో కలిసి కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతో మిఠాయిలు పంచుకొని స్థానిక వైద్యశాలలో రోగులకు బస్టాండ్ ప్రాంతంలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే ఎంపీల ఎన్నికల సందర్భంలో మరియు స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల విషయంలో ముందుండి పార్టీ అభ్యర్థులు గెలిపించేందుకు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి నాయిని సత్యపాల్ రెడ్డి అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకను మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ శ్రేణులు అభిమాన నాయకులు కలిసి ఈ జన్మ దిన వేడుకను ఘనంగా నిర్వహించుకున్నామని అది ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, శ్రీరామగిరి సర్పంచ్ మాధరీ ప్రశాంత్, ఉప సర్పంచులు హరీష్ ,వెంకన్న , ఏఎంసీ డైరెక్టర్లు భాస్కర్ నాయక్, యాకసాలు, నరేందర్, మల్లేశం, నాయకులు దుప్పతురి రాజు, బోల్లి కొడ నాగరాజు, కత్తుల యాకాంతం,మౌనేందర్ ,హెచ్ రవి, హెచ్ అలివేలు, పెరుమాండ్ల రాజు, చేన్నబోయిన శ్రీనివాస్, గోగుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.



