Friday, April 17, 2026
E-PAPER
Homeవరంగల్ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం.!

ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం.!

- Advertisement -

ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్

నవ తెలంగాణ-మల్హర్ రావు.
ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ అన్నారు.గురువారం తాడిచెర్లలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభలో భాగంగా ఆయన మాట్లాడారు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు,గృహజ్యోతి, మహాలక్ష్మి,చేయుత పింఛన్లు,రేషన్ కార్డులు,రైతు భరోసా,రైతు బీమా,మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తోందన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలికి పని కల్పించడం జరుగుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వం కూలీలకు పనిముట్లను పంపిణీ చేయకపోగా ఉపాధిహామీ పథకాన్ని నిరుగార్చేలా చేస్తోందన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ ద్యేయమన్నారు.కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక యాప్లో ప్రతి కూలి ఫొటోను ఉదయం,సాయంత్రం తీసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయగా తీర్మానం చేసి జిల్లాకు పంపిస్తామని ఎంపిడిఓ చెప్పారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -