Friday, April 17, 2026
E-PAPER
Homeవరంగల్ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి.

ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి.

- Advertisement -

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బండి రాజయ్య

నవ తెలంగాణ-మల్హర్ రావు.
ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో మండల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కాళేశ్వరం దేవస్థాన మాజీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండి రాజయ్య ప్రభుత్వానికి,అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో గురువారం మండల ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తికి వినపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు తాడిచెర్ల నుంచి కొయ్యుర్ మీదుగా వయ కాటారం భూపాలపల్లి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని.తాడిచెర్ల నుంచి కాపురం,వెంచరామి నుంచి జమ్మికుంట వరకు నిలిసిన రోడ్డు నిర్మాణ పనులు పున:ప్రారంభించాలని కోరారు.మండల కేంద్రంలో రోగుల సౌకర్యార్థం ఆరోగ్య కేంద్రంలో సిటిస్కాన్,జిల్లా కేంద్రంలో ఎమ్మార్ఐ స్కాన్ ఏర్పాటు చేయాలని కోరారు.కాటారం సబ్ డివిజన్ పరిధిలో నిరుద్యోగ యువతకు ఉపాధి,ఉద్యోగాల కల్పన కోసం ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు.ఏఎమ్మార్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.35 వేల వేతనం,ఎంప్లాయ్ కోడ్ లేని కార్మికులకు కోడ్ ఇవ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -