Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత చదువుతోపాటు ఆటల్లో రాణించాలి.

యువత చదువుతోపాటు ఆటల్లో రాణించాలి.

- Advertisement -

టిసిఎల్ సీజన్-6 టోర్నీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం
టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
నవ తెలంగాణ-మల్హర్ రావు.

యువత చదువుతోపాటు ఆటల్లో రాణించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన తాడిచెర్లలో ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా టిసిఎల్ సీజన్-6 క్రికెట్ టోర్నీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానోత్సవంలో భాగంగా బుధవారం ముఖ్యదితిగా శ్రీనుబాబు హాజరై విజేతలుగా నిలిసిన జట్లకు బహుమతులు అందజేసి,అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు క్రీడలతో యువతలో స్నేహాభావం,క్రమశిక్షణ, ఐక్యత భావం పెంపొందించే అవకాశం ఉందన్నారు.ముఖ్యంగా యువత చెడుఅలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.మద్యం,గజాయి,గుట్కా తదితర చెడుఅలవాట్లతో భవిష్యత్ నాశనం అవుతుందని హెచ్చరించారు. క్రీడలపై దృష్టి సారించి ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్,పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొoడయ్య,సర్పంచ్లు బండి స్వామి,మేకల రాజయ్య,గడ్డం క్రాoతి,బండారి నర్సింగం,ఉప సర్పంచ్లు బొబ్బిలి రాజు గౌడ్,తాళ్ల రవిందర్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి,వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య,వొన్న తిరుపతి రావు,తిర్రి అశోక్,ఇందారపు సారయ్య, కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య,మండల రాహుల్,ఇందారపు ప్రభాకర్,బొబ్బిలి నరేశ్,రాజునాయక్,బండి రణదీర్,ఇందారపు శివకుమార్,పైడాకుల సమ్మయ్య,ఆర్ని ఉదయ్,గుగ్గిళ్ల రాజ్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -