Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూమిలేని వ్యవసాయ రైతులకు రూ. 12 వేలు ఇవ్వాలి

భూమిలేని వ్యవసాయ రైతులకు రూ. 12 వేలు ఇవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిన నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిమట్టి పెళ్లి సైదులు డిమాండ్ చేశారు. బుధవారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి విబి జీవంజి పేరుతో కొత్త బిల్లును తీసుకొచ్చిందన్నారు.పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉపాధి హామీకి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలను రెండు పూటలు ఫోటో తీయాలని ఆలోచనను విరమించుకోవాలన్నారు.మార్చి నుండిఆగస్టు వరకు ఉపాధి కూలీలకు సమ్మర్ అలవెన్స్ వర్తింప చేయాలన్నారు.

ఉపాధి కూలీలను ఆదుకునేందుకుప్రభుత్వం 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్రప్రభుత్వం సవరించిన వ్యవసాయ కార్మికుల వేతనాలను అమలుచేసి గ్రామ సభలు నిర్వహించి పెరిగిన కూలి  రేట్లను గ్రామాలలో ప్రచారం చేయాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు 7000 రూపాయలు పింఛన్ ఇవ్వాలన్నారు. వేసవి కాలం సమీపిస్తున్నందున గ్రామాలలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పని ప్రదేశంలో కనీస సౌకర్యాలైన  త్రాగునీరు, మెడికల్ కిట్టు, టెంటు, పారా, గడ్డపార వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం, మండల కార్యదర్శి జాజిగల్ల ముత్తయ్య, నాయకులు నాగయ్య, ఎల్లమ్మ, రాములు, వెంకన్న పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -