మానవత్వం చాటుకున్న లయన్స్ క్లబ్ చైర్మన్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
రోడ్డు ప్రమాదాలు గాయపడిన క్షతగాత్రునికి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. గత వారం రోజుల క్రితం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ బీర్కూరు వెళ్లే రహదారిపై రోడ్డు ప్రమాదంలో మహమ్మద్ ఆసిఫ్ కు తీవ్ర గాయాలతో నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న తరుణంలో వారి కుటుంబ సభ్యులు ఒకరు బీర్కూర్ లయన్స్ క్లబ్ చైర్మన్ సితాల రమేష్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వెంటనే 14, వేల ఐదు వందల రూపాయలను ఆర్థిక సాయం చేసి వారికి చేతనిచ్చారు. బుదవారం క్షతగాత్రుడు మొహమ్మద్ ఆసిఫ్ ఆస్పత్రి నుంచి బీర్కూరు గ్రామానికి రావడంతో ఆసిఫ్ ఇంటికి వెళ్లి ఇచ్చి వారి కుటుంబానికి ఓదార్చి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు అబ్దుల్ నయీం, భరత్, శ్యామ్ శ్రీకాంత్, నిఖిల్, ప్రవీణ్, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.
క్షతగాత్రునికి ఆర్థిక సాయం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



