Friday, April 17, 2026
E-PAPER
Homeకరీంనగర్ప్రమాద భీమా చెక్కు అందజేత

ప్రమాద భీమా చెక్కు అందజేత

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రాయికల్ శాఖలో ఖాతాదారుడు కండ్లపెల్లి సాయిరాజ్  ప్రమాదవశాత్తు మృతి చెందగా మృతుడి తల్లి కండ్లపెల్లి లక్ష్మి(నామిని)కి రూ.1 లక్ష ప్రమాద భీమా చెక్కును తహసిల్దార్ నాగార్జున చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా  బ్రాంచ్ మేనేజర్ ఎస్.మధు మాట్లాడుతూ..గాయత్రి బ్యాంకు ప్రమాద భీమా వంటి సౌకర్యాల ద్వారా ఖాతాదారుల కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. బ్యాంకు ద్వారా మైక్రో ఏటీఎం,ఏఈపిఎస్, ఈ-కేవైసీ,రుణ సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆఫీసర్ జి. రాము,జూనియర్ ఆఫీసర్ ఎం.ఏ. ఆసీఫుద్దీన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -