Friday, April 17, 2026
E-PAPER
Homeకరీంనగర్టీచర్లను పంపొద్దు.. సర్పంచ్‌కు తల్లిదండ్రుల వినతి

టీచర్లను పంపొద్దు.. సర్పంచ్‌కు తల్లిదండ్రుల వినతి

- Advertisement -

నవతెలంగాణ–రాయికల్
మండలంలోని మైతాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపించాలని జిల్లా విద్యాధికారిని కోరిన నేపథ్యంలో, బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపకుండా చూడాలని కోరుతూ సర్పంచ్ తలారి నాగమణికి వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత ఉందని, వారిని పంపితే విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -