Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు భద్రతపై విద్యార్థులతో ప్రతిజ్ఞ

రోడ్డు భద్రతపై విద్యార్థులతో ప్రతిజ్ఞ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
రహదారి భద్రత జీవితానికి రక్షణ అని మండల విద్యాశాఖ తరిరాము అన్నారు. బుధవారం పెద్దవూర మండలం లోని పోతునూరు ప్రాధమీకొన్నత పాఠశాలలో  రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.రోడ్ల పై చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని  విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడప రాదని , వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు.అత్యధిక రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందని , దాన్ని తగ్గించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస , డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకట్రాం నాయక్,రాంమూర్తి,మెహజాబి,అంజద్,అంజుమ్,బేబీలత,ధర్మారెడ్డి,అనిత విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -