- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 9 పనుల గురించి మోడీ హామీ తీసుకున్నారు.
‘‘మీ నుంచి నాకు తొమ్మిది హామీలు కావాలి. వికసిత్ కర్ణాటక కోసం మీరంతా నాకు వాటిపై ప్రమాణం చేయండి. ఈ ప్రమాణాలను శ్రద్ధగా, నిజాయతీగా పాటిస్తే కర్ణాటకతో పాటు దేశ అభివృద్ధీ వేగంగా జరుగుతుంది’’ అని మోడీ వెల్లడించారు. ప్రధాని అడిగిన హామీలు ఏంటంటే..
- నీళ్లను వృథా చేయకుండా పొదుపుగా వాడదాం.
- పబ్లిక్ ప్రదేశాల్లో పరిశుభ్రతను పాటిద్దాం
- అమ్మ పేరుతో మొక్కలు నాటుదాం.
- ‘వోకల్ ఫర్ లోకల్’ స్వదేశీయతను చాటి చెబుదాం.
- జాతీయ పర్యావరణ రంగాన్ని అభివృద్ధి చేద్దాం.
- రసాయనాలు లేకుండా పంట సాగు చేద్దాం.
- ఆహారంలో మిల్లెట్స్‌ని భాగం చేసుకుందాం.
- నూనె పదార్థాలను పూర్తిగా తగ్గిద్దాం.
- ఫిట్‌గా, బరువుని అదుపులో ఉంచుతూ, ప్రకృతికి సేవ చేద్దాం
ఇక, ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా కొన్ని కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వైద్య సౌకర్యం అందిస్తున్నామని మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా అవకాశం కల్పించామని గుర్తుచేశారు.
- Advertisement -



