టెంట్లు, పష్టైడ్ కిట్లు , మంచి నీళ్ల సౌకర్యాలు కరువు..
కనెత్తి చూడని సంబంధిత అధికారులు..
తీవ్ర ఇబ్బందులో ఉపాది కూలీలు..
నవతెలంగాణ- కుభీర్
వేలుస తగ్గింగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపధిహామీ పథకం అసౌకర్య ల మధ్య కొనసాగుగుతుంది.కూలీలకు పని ప్రదేశాలలో కనీస సౌకర్యలు త్రాగు నీరు, టెంట్, సౌకర్యలు ఏర్పాటు చేయాల్సి ఉండగ అధికారులు ఏర్పాటు చేయడం లేదు, దింతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోజు రోజుకు ఎండ తీవ్రత పెరగడంతో కూలీలు అనరోగ్య బారిన పడుతున్నారు. ఉపధిహామీ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షింకల్సిన అధికారులు కనీసం అటు వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దింతో కూలీల శాతం ఘననీయంగా తగ్గుతు వస్తుంది.
ఉపధిహామీ పనులపై ఆసక్తి చూపని కూలీలు..
ప్రభుత్వం ఉపధిహామీ కూలీలకు రోజు కు 307రూపాయల కూలి చేల్లించి 120రోజులు పని దినాలను కల్పిస్తోంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఉపధిహామీ కూలీలు పనులపై ఆసక్తి చూపడం లేదు పనులు ప్రారంభం కాకా ముందు గ్రామ సభ ల ద్వారా పని వివరాలను, సోకర్యలపై గ్రామ సభ లో కూలీలకు వివరించాలి, కానీ గ్రామసభల సహితం తుతూ మంత్రాంగా నిర్వహించారాని ఆరోపణలు ఉన్నాయి. కూలి పనులపై, కూలి డబ్బుల చెల్లింపులు కూలీలకు అవగహన లేకపోవడంతోనే కూలీలు పనుపై ఆసక్తి చూపడం లేదు.
మండుటెండలోనే పనులు..
ఉపాది హామీ పని ప్రదేశంలో టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో కూలీలు మండు టెండలో పనులు చెల్సి వస్తుంది. ఉదయం తొమ్మిది గంటల నుండే సూర్యుడు తన ప్రతాపం చూపడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవాడంతోనే పలువురు కూలీలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల కూలీలు ఎండ తీవ్రతకు తట్టుకోలేక అనరోగ్య పలావుతున్నారు. కూలి డబ్బులు వస్తాయన్న అశతో పనులకు వెళ్తే అనరోగ్యo పాలయి అస్పత్రి చుట్టు తీరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాస్టైడ్ కిట్ల సైతం అందుబాటులో ఉండడంలేదని మండి పడుతున్నారు.
ఆగని అక్రమ వసూళ్లు..
ఉపధిహామీ పనులలో అక్రమ వసూళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఉపధిహామీ అక్రమాలపై అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికి, ఇక్కడి అధికారులు మాత్రం ఎదో ఒక్క మార్గాన్ని ఎంచుకొని కూలీల వద్ద నుంచి అక్రమ వసూళ్లకు పలుపడుతున్నారు. ఈ విషయం అధికారులకు తెల్సిన పట్టించుకోక పోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుచున్నారు.

పనులు ఒక్క చోట.. ఫోటో క్యాపచర్ మరో చోట
ఉపాది హామీ పనులలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ఫోటో హాజరు ను ప్రవేశపెట్టింది. కాగా అధికారులు మాత్రం పనులు ఒక్క చోట నిర్వహించి ఫోటో అటెండెన్స్ మరో చోట తీసుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం ఇంటి బయటకు వేళ్ళని వృద్ధుల ఫోటో అటెండెన్స్ ను ఇంటి పక్కనే తీసుకోవడం పై ఉపధిహామీ అక్రమాలకు అద్దం పడుతుంది. ప్రభుత్వం అక్రమలను అడ్డుకునేందుకు ఓ పక్క చర్యలు చే్వపడుతుంటే అధికారులు మాత్రం దొడ్డి దారిన అటెండెన్స్ వేస్తూ అక్రమాలకు పలు పలుపడుతున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి.



