నవతెలంగాణ – జుక్కల్
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల వారిగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనులు తెలియజేయడానికి మండల స్థాయి సమావేశం ఏప్రిల్ 16న నిర్వహించడం జరుగుతుందని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఈ నెల 16న మండల కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణం మండపంలో ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో వివిధ శాఖల సంబంధించిన అభివృద్ధి నివేదికలను తప్పకుండా అధికారులు తీసుకొని రావాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం మార్చి 6 నుండి జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి 1).పంచాయతీరాజ్ శాఖ (ఎంపీడీవో , ఎంపీవో).2). రెవెన్యూ శాఖ తహసిల్దార్ , 3). వ్యవసాయ శాఖ, 4). వైద్య ఆరోగ్యశాఖ ,5). పోలీసు మరియు అబ్కారీ శాఖ , 6). గృహ నిర్మాణశాఖ, 7). గ్రామీణ అభివృద్ధి శాఖ (ఐకెపి).8). విద్యుత్ శాఖ. 9). ఇతర సంబంధిత శాఖలు, 10). అభివృద్ధి పనులు. అధికారులు తప్పక తమ నివేదికారులతో హాజరు కావాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు , మహాలక్ష్మి సబ్సిడీ రూ.500 సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్ల విద్యుత్తు, సన్న రకం వడ్లకు బోనస్ , చేయూత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి బ్యాంకు రుణాలు, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డులు, ఎంపీటీసీ, జడ్పిటిసి నిధుల వివరాలు , తేది :- 2-4 2026 గ్రామసభలో వచ్చిన దరఖాస్తుల వివరాలు, ఈ అంశాలు పైన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.



