- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కూరగాయల ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. అకాల వర్షాలు, వేసవి ప్రభావంతో పంటలు దెబ్బతిని సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయి. ముఖ్యంగా టమాటా ధర కిలో రూ.10 నుంచి రూ.20-30కు చేరింది. హైదరాబాద్లోని కూకట్పల్లి రైతు బజార్లో టమాటా రూ.23, బీన్స్ రూ.60, బెండకాయ రూ.35గా ఉంది. గుంటూరులో టమాటా రూ.22, విజయవాడలో రూ.28కు అమ్ముతున్నారు. అల్లం, వెల్లుల్లి ధరలు కూడా అధికంగా ఉండటంతో ప్రజల ఖర్చులు మరింత పెరిగాయి.
- Advertisement -



