- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను ప్రారంభించింది. ఇకపై కరెంట్, గ్యాస్, నీరు, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు, లోన్ రీపేమెంట్లు వంటి 30 రకాల బిల్లులను, 22,700 పైగా బిల్లర్లకు వాట్సాప్ ద్వారా సులభంగా చెల్లించవచ్చు. భారత్ కనెక్ట్ నెట్వర్క్తో కలిసి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో చేసిన చెల్లింపులను చూడటంతో పాటు, రాబోయే బిల్లులను ట్రాక్ చేయవచ్చు. మారుమూల ప్రాంతాల ప్రజలకు డిజిటల్ చెల్లింపులను చేరువ చేయడమే లక్ష్యమని మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ శ్రీనివాస్ తెలిపారు.
- Advertisement -



