Saturday, September 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజేఎన్టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ..

జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జేఎన్టీయూ క్యాంపస్ విద్యార్థుల ఘర్షణతో రణరంగంగా మారింది. గురువారం అర్ధరాత్రి రెండు వర్గాలకు చెందిన విద్యార్థులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు 19 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేసి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం క్యాంపస్‌లో నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన చిన్న వాగ్వివాదానికి పాత కక్షలు కూడా తోడవడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో మంజీరా హాస్టల్‌కు చెందిన కొందరు విద్యార్థులు, గౌతమి హాస్టల్‌పై దాడి చేశారు. అక్కడి విద్యార్థులను గదుల్లోంచి బయటకు పిలిచి కర్రలతో దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేసి, పరారీలో ఉన్న విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, విచారణ కమిటీ ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్టీయూ ప్రిన్సిపల్ డాక్టర్ జి.వి. నరసింహారెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -