Sunday, September 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసర్‌ప్రైజ్‌ చేసే ‘ఎపిక్‌’

సర్‌ప్రైజ్‌ చేసే ‘ఎపిక్‌’

- Advertisement -

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాని ఈనెల 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రష్మిక మందన్నా, డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రష్మిక మందన్నా మాట్లాడుతూ, ‘ట్రైలర్ నాకు నచ్చింది. ఆనంద్ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. సినిమా కోసమే కష్టపడుతుంటాడు. కడలి పాత్ర గొప్పగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంతో వైష్ణవికి గొప్ప పేరు వస్తుంది’ అని తెలిపారు. ‘ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఈ సినిమా అందరికీ ఓ థెరపీలా ఉంటుంది. ఇదొక ఎమోషనల్, అందమైన చిత్రం. అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది’ అని ఆనంద్ దేవరకొండ అన్నారు. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ,‘కడలి పాత్రలో నన్ను చూసి, నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఆదిత్యకి థాంక్స్’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -