Sunday, September 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవివాహ వేడుకలో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

వివాహ వేడుకలో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగో రాజధాని కిన్షాసాలోని లింగ్వాలా ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వివాహ వేడుక జరుగుతున్న భవనంలో మంటలు చెలరేగాయి. ఇరుకైన మార్గాల కారణంగా లోపల ఉన్నవారు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం తెల్లవారుజాము వరకు మంటలు కొనసాగాయి. మేయర్ నార్బర్ట్ ముషింగా మృతుల సంఖ్య 22గా ఉందని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ షబానీ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -