Monday, September 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజపాన్ పర్యటనకు కర్ని పాఠశాల పీడీ బి.రూప ఎంపిక

జపాన్ పర్యటనకు కర్ని పాఠశాల పీడీ బి.రూప ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ-మక్తల్ : అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలు, బోధనా పద్ధతులపై అవగాహన పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మక్తల్ మండలం కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ బి.రూప (SA–Physical Education) జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు.రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ పర్యటనను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు జరిగే పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 29 మంది ఉపాధ్యాయులు, 11 మంది విద్యాశాఖ అధికారులు పాల్గొంటున్నారు.పర్యటనలో భాగంగా బి.రూప జపాన్‌లోని వివిధ విద్యా సంస్థలను సందర్శించి అక్కడి క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, జీవన నైపుణ్యాల బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, పాఠశాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించనున్నారు. జపాన్ విద్యా విధానంలోని అనుసరించదగిన ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఈ అనుభవం దోహదపడనుంది.

విద్యార్థుల క్రీడా, విద్యా వికాసానికి కృషి చేస్తున్న బి.రూపకు అంతర్జాతీయ స్థాయి పర్యటనకు అవకాశం లభించడం పట్ల జడ్‌పీహెచ్‌ఎస్ కర్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందిస్తూ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ పాఠశాల నుంచి జపాన్ వరకు.కర్ని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బి.రూపకు దక్కిన ఈ అరుదైన అవకాశం పాఠశాలకే కాకుండా నారాయణపేట జిల్లాకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -