- సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్: శాసనసభ స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.దళిత వ్యక్తిని ప్రతిపక్ష నేతగా చూడలేకపోతున్నారని సీఎం అన్నారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక ఆలోచనను సరిదిద్దకపోతే భవిష్యత్ తరాలు ఈ సభను క్షమించవన్నారు. ఈ రకమైన అవమానం ఎప్పుడూ, ఎక్కడా జరగలేదని వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. స్పీకర్ చైర్‌ను అభ్యంతరకర భాష మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధును బీఆర్ఎస్ డిస్మిస్ చేయాలన్నారు. తాతా మధుతో రాజీనామా చేయించాలని.. లేకపోతే బర్తరఫ్ చేయాలన్నారు. తాము ఏం మాట్లాడినా వెనుక కేసీఆర్ ఉన్నారని బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.



