- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా- ఇరాన్‌లు యుద్ధానికి ముగింపు పలకడానికి మరోసారి శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. పాకిస్తాన్లో తాజాగా వచ్చే సోమవారం రెండో దఫా శాంతి చర్చలు జరుపుకోనున్నట్లు ఇరాన్ అధికారులు మీడియాకు వెల్లడించారు. దీని కోసం ఇరుపక్షాల ప్రతినిధుల బృందాలు ఆదివారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకునే అవకాశం ఉందని ఈ చర్చల గురించిన సమాచారం తెలిసిన ఇరాన్ అధికారులు సిఎన్ఎన్ మీడియా తెలిపారు. కాగా, అమెరికా – ఇరాన్‌లు ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిపిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.
- Advertisement -



