- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నాడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో అనేక జిల్లాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఉత్తర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు తీరప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Advertisement -



