Tuesday, September 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదసరా నాటికి 2 లక్షల ఇండ్లను పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి

దసరా నాటికి 2 లక్షల ఇండ్లను పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : గుడిసెలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌ తరహాలోనే ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ టవర్స్‌ నిర్మిస్తామని తెలిపారు. సోమవారం శాసనమండలిలో ఇందిరమ్మ ఇళ్లపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లకు గాను 1.97 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, దసరా నాటికి 2 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -