- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని గొండియా-బాలాఘాట్ జాతీయ రహదారిపై ఈ రోజు ఘోర ప్రమాదం జరిగింది. గొండియా సమీపంలోని నాగ్రా వద్ద వేగంగా వచ్చిన ట్రక్కు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాకు చెందినవారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
- Advertisement -



