Tuesday, September 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత..

ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్‌ పిలుపునివ్వడంతో ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. నర్సారెడ్డి ఆధ్వర్యంలో వరదరాజపూర్‌ మీదుగా ఫామ్‌హౌస్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు బారికేడ్లు, రోప్‌ పార్టీతో అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ఫామ్‌హౌస్‌కు అర కిలోమీటరు సమీపంలోకి వెళ్లి డప్పులు మోగిస్తూ నిరసన తెలిపారు. పోలీసులు వారిని వెనక్కి తీసుకొచ్చారు. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి బారికేడ్లు తోసుకుని ఫామ్‌హౌస్‌ వైపు పరుగులు తీశారు. మర్కుక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు రైతు దీక్ష పేరుతో ఆందోళనకు దిగడంతో ఎర్రవల్లి పరిసరాల్లో ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -