నవతెలంగాణ-మిడ్జిల్
నిరక్షరాసులను అక్షరాసులుగా తీర్చిదిద్దాలనీ, చదువు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతయ్య పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు, కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బడి బయట ఉన్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం విద్యార్థులు చదువుకుందాం, ముందుకు సాగుదాం, ఇంటింటికి అక్షర జ్యోతి, అక్షరాస్యతతోనే, సమాజా వికాసం అంటూ ప్లకార్డులతో విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారి కవిత, చరణ్ , అక్తర్, సంధ్యారాణి, శ్రావణ్ కుమార్, శిరీష, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అక్షరాస్యతతోనే సమాజం వికాసం: ప్రిన్సిపల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



