తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డైరెక్టర్ బోయపాటి శ్రీను హాజరయ్యారు. హీరో కార్తి మాట్లాడుతూ, ‘‘సర్దార్ 2’ నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఇలాంటి స్పై క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం. నిజానికి గూఢచారులకు ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ వాళ్ల పని వాళ్లు చాలా నిజాయితీతో, ఏదీ ఆశించకుండా చేస్తారు. ‘సర్దార్ 2’ చూసే ముందు ‘సర్దార్’ సినిమా మరొకసారి చూడమని కోరుతున్నాను. అది యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది. అలా ఆ సినిమా చూస్తే మీరు ‘సర్దార్ 2’కి ఇంకా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతారు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు ఇంత స్టైలిష్‌గా యాక్షన్ సినిమాలు చేయడం మనకు కుదరదా అని అనిపించేది. అది ఈ సినిమాతో తీరింది. మిత్రన్ అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. మ్యూజిక్, యాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగార్జున, సుప్రియకి ధన్యవాదాలు’ అని తెలిపారు. ‘తెలుగు సినిమా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తోంది. పరిశ్రమ కళకళలాడుతోంది. ఇలాంటి సమయంలో ‘సర్దార్ 2’ సినిమా వస్తోంది. ఈ సినిమా కూడా ఇదే దోవలో అద్భుతమైన సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
‘సర్దార్ 2’లో యాక్షన్ నెక్స్ట్ లెవెల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


