– ప్రకటించిన మొదటి రోజు కార్యాచరణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో అంతర్భాగంగా ఈ నెల 20 సోమవారం నుండి 26 వ తేదీ ఆదివారం వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో సంక్షేమ వారం నిర్వహించనున్నారు. సోమవారం ప్రారంభమమ్యే ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులు పాఠశాల లను సందర్శిస్తారు. ఆ పాఠశాల లో ఆహార భద్రత కమిటీ ఏర్పాటు, విద్యార్థులు కమిటీ గా ఏర్పడ్డారా,ఆ పాఠశాల కు సరఫరా చేసే బియ్యం సన్నాలా,దొడ్డు బియ్యం మా, విద్యార్థులకు సరఫరా చేసే నిల్వ పదార్థాల నాణ్యత,ఎక్ష్ఫైరీ, వంటగది పరిస్థితి,పాఠశాల ప్రాంగణం, విద్యార్థులు వినియోగించే మరుగు దొడ్లు నిత్యం శుభ్రం చేస్తున్నారా లేదా, వంట నిర్వాహకులు కూరగాయలు శుభ్రం చేస్తున్నారా లేదా,వంటకు ఏ రకం నీరు వినియోగిస్తున్నారు,వంట పాత్రలు శుభ్రం చేయడానికి ని ఏ రకం డిటెర్జెంట్ వాడు తున్నారు, విద్యార్థులు భోజనానికి ముందు,భోజనం తర్వాత చేతులు శుభ్రం చేసుకుంటున్నారా, విద్యార్థులు వారి ఆహారం తీసుకునే ప్లేట్ లను సబ్బుతో లేక నీటితో శుభ్రపరుచుకుంటున్నారా, తనిఖీ సమయం లో అధికారి అక్కడి భోజనం రుచి చూసారా లేదా, చూస్తే ఏ రకంగా ఉంది అనే అంశాలను పొందుపరుస్తూ నివేదిక రూపాందించాలి.ఈ నివేదిక ప్రకారం ఎక్సలెంట్,గుడ్,యావరేజ్,బ్యాడ్ అనే ర్యాంకింగ్ సైతం నమోదు చేయాల్సి ఉంటుంది.
రేపటి నుంచి విద్యాశాఖ సంక్షేమ వారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



