Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల జీపీ కార్యదర్శికి ఆర్టిఐ నాయకుల పరామర్శ

తాడిచెర్ల జీపీ కార్యదర్శికి ఆర్టిఐ నాయకుల పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి చెలిమల్ల మల్లిఖార్జునరెడ్డి మాతృమూర్తి చెలిమల్ల రాజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్,మండల కమిటీ సభ్యుడు బండి సుధాకర్ ఆదివారం వారి స్వగ్రామైన మంథని మండలంలోని నాగేపల్లిలో మృతురాలి కుటుంబాన్ని పరమార్షించి,ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం ఆమే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ముడుతనపల్లి ప్రభాకర్,చొప్పరి రాజయ్య,రాజు,రావుల అంజయ్య,గ్రామీణ వైద్యుడు చక్రవర్తి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -