Sunday, April 19, 2026
E-PAPER
Homeక్రైమ్రోడ్డు పక్కన చెట్లకు నిప్పు

రోడ్డు పక్కన చెట్లకు నిప్పు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రం నుంచి హస కొత్తూర్ వెళ్లే రహదారి పక్కన ఆదివారం 10 చెట్లకు నిప్పంటుకుంది. చెట్ల వద్ద ఉన్న మొక్కజొన్న పొట్టుకు నిప్పు అంటించడంతో ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన చెట్లకు నిప్పు పెట్టడం వల్ల పచ్చదనం నాశనం కావడం, పర్యావరణానికి హాని కలుగుతోంది.  పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చెట్ల పెంపకానికి ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. తద్వారా మొక్కలునాటి పెంచడానికి బోలెడు డబ్బులు ఖర్చుచేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు నానాతంటాలు పడుతుంటే, మరోవైపు పెరిగిన చెట్లను కొందరు నాశనం చేస్తూ ప్రభుత్వ ఆశయానికి గండి పెడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -