Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధీరవనిత చిట్యాల ఐలమ్మ : సీఎం

ధీరవనిత చిట్యాల ఐలమ్మ : సీఎం

- Advertisement -

గడీల పాలనకు, దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. అణచివేత, దమనకాండకు వ్యతిరేకంగా ఆమె ఎగరేసిన ధిక్కార పతాకం తెలంగాణ సాయుధ పోరాట‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. దాదాపు 80 ఏండ్ల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటానికి జంగ్ సైరన్ మోగించారని సీఎం గుర్తు చేశారు. సమ్మక్క-సారక్క, చిట్యాల ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -