హిందూ–ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించడం కుట్ర
అసెంబ్లీలో పరిణామాలు బాధాకరం : ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి
నవతెలంగాణ-అంబర్‌పేట
తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బీజేపీ వక్రీకరిస్తూ కుట్రలకు పాల్పడుతోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి విమర్శించారు. సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కార్యాలయంలో బుధవారం చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి, భుక్తి కోసం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సాగిందన్నారు. ఈ పోరాటం ద్వారా వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టులకు దక్కిందని తెలిపారు. మూడు వేలకుపైగా గ్రామ స్వరాజ్య కమిటీలను ఏర్పాటు చేసి, ప్రజలకు న్యాయం జరిగేలా పోరాటం సాగిందన్నారు. అనేక మంది కమ్యూనిస్టుల బలిదానాలతోనే తెలంగాణ రైతాంగ పోరాటం విజయవంతమైందని వివరించారు. కానీ ఆ పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేడు ఆ చరిత్రను వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు కార్పొరేట్ కంపెనీల కార్యకలా పాల కారణంగానే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. కంపెనీల విధ్వంసకర కార్యకలాపాలతోనే దేశంలో ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నా యన్నారు. కృత్రిమ మేధ ఆధారిత డేటా కేంద్రాల ఏర్పాటుతోనూ పర్యావరణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. రాష్ట్ర అసెంబ్లీలో మూడ్రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. అధికార, ప్రతిపక్షాల వ్యవహారశైలి సరిగా లేదని, దీంతో ప్రజాధనం వృథా అవుతోందని విమర ్శించారు. రాష్ట్రంలో గత ఎన్నికల సంద ర్భంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.ప్రభాకర్, నగర కార్యదర్శి ఎం.వెంకటేష్, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. శ్రీనివాస్‌రావు, కేఎన్ రాజన్న, కె. నాగలక్ష్మి, ఎం.దశరథ్, ఎం.మహేందర్, జిల్లా కమిటీ సభ్యులు జె. కుమారస్వామి, నరేష్, మల్లేష్, కిరణ్, అజయ్‌బాబు, సత్యనారాయణ, శేషగిరిరావు, ప్రజాసంఘాల నాయకులు అశోక్, జావీద్, కళ్యాణ్, సుబ్బారావు పాల్గొన్నారు.
సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



