Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐద్వా ఆధ్వర్యంలో నేటి నుంచి వీరవనితల స్ఫూర్తి యాత్ర

ఐద్వా ఆధ్వర్యంలో నేటి నుంచి వీరవనితల స్ఫూర్తి యాత్ర

- Advertisement -

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట
వారోత్సవాల‌కు ఐద్వా సన్నద్ధం
10నుంచి 17వరకు జీపు జాత
పోరాటంలో చారిత్రక నేపథ్యమున్న
గ్రామాల సందర్శన
పాలకుర్తి ప్రారంభ సభకు ఐద్వా ప్రధాన కార్యదర్శి కననికాఘోష్‌ ‌
విలేకర్ల సమావేశంలో ఐద్వా నేతల వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్బంగా గురువారం నుంచి వీరవనితల స్ఫూర్తి యాత్రను వారం రోజుల పాటు నిర్వహించనున్నట్టు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ అరుణ జ్యోతి,మల్లు లక్ష్మి తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఐద్వా సీనియర్‌ ‌నాయకులు టి జ్యోతి, సహాయ కార్యదర్శి కెఎన్‌ ఆశాలత, శశికళతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా యాత్ర పోస్టర్‌‌ను విడుదల చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పురుషులతో పాటు మహిళలు కూడా అత్యంత ధైర్య సాహాసాలతో పోరాడారని తెలిపారు. వారి పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎంతగానో అవసరమన్నారు. మనువాద భావాజాలం వికృతంగా విస్రృతం చేస్తున్న తరుణంలో వీర వనితల పోరాటాన్ని, వారి చరిత్రను చాటి చెప్పాల్సిన అవశ్యకత పెరిగిందని చెప్పారు. ‘మహిళలు వంటింటికే పరిమితం కాదు సుమా.. వారు తెగిస్తే..ఎలాంటి పోరాటానికైనా వెనుకాడరని’ మనువాద పాలకులకు చెప్పాల్సిన అవసరముందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమంటే..రెండు మతాల మధ్య కొట్లాటగా వక్రీకరిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శక్తుల కుయుక్తులను ఎండగడతామన్నారు. రాచరికానికి వ్యతిరేకంగా భూమి, భుక్తి విముక్తి కోసం సాగిన ఆ మహాత్తర పోరాటంలో మహిళలు గన్నుపట్టి, వెన్ను చూపని పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆ పోరాట స్ఫూర్తిని నేటి యువతీ, యువకులకు అందించాలనే లక్ష్యంతో ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్ఫూర్తి యాత్ర సాగుతుందని చెప్పారు. ఈ యాత్రలో ఆర్‌ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, కెఎన్‌ ఆశాలత, బుగ్గవీటి సరళ పాల్గొంటారని తెలిపారు.

​నేడు పాలకుర్తిలో సభ..
స్ఫూర్తి యాత్ర ప్రారంభ సూచకంగా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి, తెగువను గుర్తు చేసుకుంటూ ఐలమ్మ 41వ వర్థంతి సందర్బంగా పాలకుర్తిలో గురువారం ప్రారంభ సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ సభకు ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి కనినకా ఘోష్‌ ‌పాల్గొంటారని చెప్పారు. అక్కడ నుంచి ఎనిమిది రోజుల పాటు నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో చారిత్రక పోరాట ప్రాంతాలు, అమరుల స్థూపాలను సందర్శించి నివాళులర్పించనున్నట్టు వివరించారు.ముగింపు 17న ముగింపు సభను కొలను పాకలో ఆరుట్ల కమలాదేవి స్థూపం వద్ద ఉంటుందనీ, ఆ సభలో ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ ‌పుణ్యవతి పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -