Thursday, September 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళిత, గిరిజన, బహుజనులు ఆత్మగౌరవం కోసం ఆలోచించాలి

దళిత, గిరిజన, బహుజనులు ఆత్మగౌరవం కోసం ఆలోచించాలి

- Advertisement -

ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో దళిత, గిరిజన, బహుజనులు ముందుండి పోరాడారని, వారి త్యాగాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఆ హామీని నిలబెట్టుకోకుండా పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారని విమర్శించారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను అవమానకరంగా బర్తరఫ్ చేశారని, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కను అవమానించేలా సీఎల్పీని రద్దు చేశారని ఆరోపించారు. సిరిసిల్లలో అక్రమ ఇసుక లారీలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన దళిత యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, గతంలో దళితులపై దాడులు, హత్యలు జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభకు దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా ఉన్నారని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి సభకు హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనను తెలంగాణ సమాజం తీవ్రంగా పరిగణించాలని కోరారు.

స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కోరుతూ దళిత సమాజం ఫామ్‌హౌస్ ముట్టడికి వెళ్లిన సమయంలో, దళితులు నడిచిన రోడ్డును పసుపు నీళ్లతో శుద్ధి చేయడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై దళిత, గిరిజన, బహుజనులు ఆత్మగౌరవంతో ఆలోచించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌వాదులు, బహుజనవాదులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు, బుద్ధిజీవులు, సబ్బండవర్గాలు ఈ అంశంపై స్పందించాలని దండు రమేష్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -