- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్ ; ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా, ఇరాన్ అమెరికా యుద్ధనౌకలపై డ్రోన్ దాడులకు దిగింది. సీజ్ ఫైర్ అమలులో ఉండగానే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఉద్రిక్తతలను పెంచింది. అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు జరుగనున్న వేళ ఈ దాడులు డీల్ పై అనిశ్చితిని రేకెత్తించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ 90 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 96 డాలర్లకు చేరి మార్కెట్లను ఆందోళనకు గురిచేశాయి.
- Advertisement -



