- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్ అడ్డగుట్ట పరిధిలోని ఆజాద్ చంద్రశేఖర్ నగర్‌లో అర్థరాత్రి కలకలం రేగింది. మరమ్మత్తుల కోసం తవ్విన రోడ్డులో ఉన్న విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో భూమి నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. జేఎన్‌ఆర్‌ఎం 5వ బ్లాక్ వద్ద జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో బస్తీ మొత్తం చీకటిలో మునిగిపోయింది. సమాచారం ఇచ్చినా విద్యుత్ శాఖ అధికారులు, 100కు కాల్ చేసినా పోలీసులు వెంటనే స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- Advertisement -



