Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంరాజస్థాన్ బాలోత్రాలో భారీ పేలుడు

రాజస్థాన్ బాలోత్రాలో భారీ పేలుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్‌లోని బాలోత్రా జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. బాలోత్రా రిఫైనరీలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రత దృష్ట్యా కోట్ల రూపాయల విలువైన యంత్రసామగ్రి కాలిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ రిఫైనరీ ప్రారభంకావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -