Thursday, September 10, 2026
E-PAPER
Homeజిల్లాలుఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కాంబ్లె సాయిలు

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కాంబ్లె సాయిలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: మండల పరిధిలోని మహమ్మదాబాద్‌ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కాంబ్లె సాయిలు గురువారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంబ్లె గోపాల్‌ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం, సామాజిక న్యాయం, సేవ చేయడం, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న, ఆర్థికంగా, సమాజికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులను తమకాళ్ల మీద తాము నిలబడేలా కృషి చేసినందుకు సాయిలుకు ఈ అవార్డు వరించిందన్నారు. ఈ మేరకు సాయిలు పడిన శ్రమను లయన్స్‌ క్లబ్‌ కమిటీ గుర్తించి, ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసిందన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికను అందజేశారని తెలిపారు. ఇందులో భాగంగా మండల ఉపాధ్యాయులందరూ సాయిలుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -