Friday, September 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆద్యంతం ఉత్కంఠభరితం

ఆద్యంతం ఉత్కంఠభరితం

- Advertisement -

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ జంటగా తెర కెక్కుతున్న సినిమా ‘ఆ’. ఇటీవల అడివి శేష్ విడు దల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పం దన రావడంతో.. తాజాగా చిత్ర బృందం ‘బ్లడీ హంగర్’ పేరుతో ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసింది. స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యాన ర్లపై రూపొందుతున్న ఈ థ్రిల్లర్‌కి సాయి బాలి దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. డైలాగ్స్ లేకుండా రూపొందించిన ఈ గ్లింప్స్.. భయానక విజువల్స్, ఆసక్తికరమైన కథనంతో మొదటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. యువతుల అదృశ్యానికి సంబంధించిన ఓ ఉత్కంఠభరితమైన దర్యాప్తు చుట్టూ కథ సాగనున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో చీకటిలో పనిచేస్తున్న ఓ మిస్టీరియస్ దుష్టశక్తిని కూడా పరిచయం చేసింది. ‘అమ్మాయి’, ‘అదృశ్యం’, ‘అన్వేషణ’ అనే పదాలను ఉపయోగిస్తూ సినిమా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగనుందని ఆసక్తికరంగా వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -