Friday, September 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘వృషకర్మ’ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

‘వృషకర్మ’ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

హీరో నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో రూపొందు తున్న మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా డిసెంబర్ 4న విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సంద ర్భంగా మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. కార్తిక్ దండు డిఫరెంట్ విజన్‌తో పాటు ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ క్రియేటివ్ ఫోర్సెస్ ‘వృషకర్మ’ కోసం కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పటికే సినిమా స్ట్రైకింగ్ గ్లింప్స్, బిహైండ్ ది సీన్స్ వీడియోలు విడుదలై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచాయి. ఈ వీడియోలు సినిమా యూనిక్ వరల్డ్, స్కేల్, విజువల్ గ్రాండియర్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన లుక్ ను అందించాయి. వైవిధ్యమైన, ఛాలెంజింగ్ సబ్జెక్టుల తో వస్తున్న నాగచైతన్య ఇందులో డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -