Monday, April 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేసీఆర్ అవినీతిని ప్రకృతే బయటపెట్టింది:సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ అవినీతిని ప్రకృతే బయటపెట్టింది:సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్: కేసీఆర్ అవినీతిని ప్రకృతే బయటపెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయింది అని సీఎం వ్యాఖ్యానించారు. సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన ఆయన, కుంగిన పిల్లర్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం అంచనా వ్యయాన్ని రూ. 35 వేల కోట్ల నుంచి ఏకంగా లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. కాళేశ్వరం ఓ అద్భుతమని అందరినీ భ్రమల్లో ముంచారని మండిప‌డ్డారు.

కేసీఆర్, హరీష్ రావులను జైల్లో పెడతామని గతంలో బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికారని.. కానీ తాము రెండుసార్లు సీబీఐకి లేఖలు రాసినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు పునరుద్ధరణపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాము ఇప్పటికే సాంకేతిక నిపుణులు మరియు మూడు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించామని, శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు మొదలుపెట్టామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -