Monday, April 20, 2026
E-PAPER
Homeకరీంనగర్జన గణన సర్వేతో దేశ భవిష్యత్ నిర్దేశించబడుతుంది

జన గణన సర్వేతో దేశ భవిష్యత్ నిర్దేశించబడుతుంది

- Advertisement -

జిల్లా ప్రణాళికా అధికారి శ్రీనివాసా చారి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
దేశం మొత్తం మీద ఏక కాలంలో జరుగుతున్న జనాభా గణన చాలా ప్రత్యేకమైనది జిల్లా ప్రణాళికా అధికారి మరియు జిల్లా అదనపు జనగణన అధికారి శ్రీనివాసా చారి అన్నారు. సిరిసిల్ల పట్టణ కేంద్రం లో ఎన్యూమరేట్ మరియు సూపర్ వైజర్ లకు స్థానిక ప్రధాన గ్రంథాలయం లో నిర్వహించబడుతున్న శిక్షణా తరగతుల ను పర్యవేక్షించిన ఆయన సమావేశం ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఇట్టి గణన కరోనా కారణం 5 సంవత్సరములు ఆలస్యముగా 15సం. ల తర్వాత నిర్వహించబడుతుంది అని అన్నారు.

అలాగే పూర్తి డిజిటల్ మోడ్ మరియు స్వీయ గణనకు అవకాశం కల్పిస్తూ ఈసారి గణన జరుగుతుందని అన్నారు. మొదటి దశలో ఇండ్ల గణన , రెండవ దశలో జనాభా గణన ఉంటుందని దీనికోసం ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించనున్నారని అన్నారు. జనాభా గణన విజయవంతం అయితే భావి తరాలకు ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సాయి కృష్ణ, మాస్టర్ ట్రైనర్ దోర్నాల భూపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -